దేశంలోనే మొదటిసారిగా వృద్ధులకు ఎక్కువ మొత్తంలో పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ స్పష్టం చేశారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌తోపాటు... మిగిలిన ఉత్తరాది రాష్ట్రాల్లో రూ.500లు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెన్షన్ల కోసం ముఖ్యమంత్రి ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిచినట్లు వెల్లడించారు. ఏటా ఇచ్చే మొత్తం 9వేల 192,88కోట్లు కాగా... దీంట్లో కేంద్ర ప్రభుత్వ కోటా చాలా తక్కువని చెప్పారు. భాజపా ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో అతిక్కువ పింఛన్ ఇస్తూ ప్రజల వద్ద గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
'దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ' - HYDERABAD
ఆసరా పింఛన్ల వల్ల వృద్ధుల జీవితాల్లో వెలుగు నిండుతున్నాయని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఎక్కువ మొత్తంలో పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. పింఛన్ పంపిణీపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

"పింఛన్ల వల్ల వృద్ధుల జీవితాల్లో వెలుగు నిండింది"
Last Updated : Sep 21, 2019, 3:44 PM IST