నాగుల చవితిని పురస్కరించుకుని బుధవారం తిరుమలలో పెద్ద శేషవాహన సేవను తితిదే నిర్వహించనుంది. రాత్రి 7 నుంచి 8:30 గంటల మధ్య వాహన సేవ జరగనుంది.
నాగులచవితి రోజు తిరుమలలో పెద్దశేష వాహనసేవ - తిరుమల శ్రీవారి వార్తలు
నాగుల చవితి సందర్భంగా తిరుమలలో బుధవారం పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని తితిదే అధికారులు తెలిపారు.
![నాగులచవితి రోజు తిరుమలలో పెద్దశేష వాహనసేవ tirumala news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9569813-799-9569813-1605608661996.jpg)
నాగులచవితి నాడు తిరుమలలో పెద్దశేష వాహనసేవ
మలయప్పస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏటా నాగులచవితి నాడు పెద్దశేష వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీ. కరోనా ప్రభావం వల్ల పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్నారు.
ఇవీచూడండి:తిరుమల శ్రీవారి సన్నిధిలో తమిళనాడు సీఎం పళనిస్వామి