తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచి పీఈసెట్ పరీక్షలు.. వారికి మరో అవకాశం లేదు - పీఈసెట్ తాజా వార్తలు

బీపీఎడ్​, డీపీఎడ్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్ పరీక్షలను ఇవాళ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో 7,368 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారని పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు.

pecet exams starts from saturday
రేపటి నుంచే పీఈసెట్ పరీక్షలు.. వారికి మరో అవకాశం లేదు

By

Published : Nov 7, 2020, 5:32 AM IST

వ్యాయామ ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ పీఈసెట్ దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 7,368 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. బీపీఎడ్​, డీపీఎడ్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్ నిర్వహిస్తున్నారు.

కరోనా పాజిటివ్ ఉన్న అభ్యర్థులకు పరీక్షలకు అనుమతి లేదని పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. కరోనాతో బాధపడుతున్న వారికి మరోసారి నిర్వహించే ఆలోచన లేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఇద్దరు ప్రత్యేక అధికారులు, 15 మంది సర్పంచ్‌లు సస్పెన్షన్‌

ABOUT THE AUTHOR

...view details