జనతా కర్ఫ్యూకి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వీయ నిర్బంధంలోనే గడిపారు. హైదరాబాద్ పంజాగుట్టలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రణగొణ ధ్వనులతో మార్మోగిపోయే రోడ్లు.. నెమళ్లు వచ్చి షికారు చేసేంత ప్రశాంతంగా మారిపోయాయి. కేబీఆర్ పార్క్ వద్ద నెమళ్లు.. రోడ్ల పైకి వచ్చి సందడి చేశాయి.
జనతా కర్ఫ్యూ: బంజారా హిల్స్‌లో నెమళ్ల సందడి - హైదరాబాద్‌లో జనతా కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూ భాగ్యనగరవాసుల నుంచి విశేష స్పందన వచ్చింది. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారడం వల్ల బంజారా హిల్స్‌లో నెమళ్లు సందడి చేశాయి.
జనతా కర్ఫ్యూ: పంజాగుట్ట రహదారిపై నెమళ్ల సందడి
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించి ఇంటికి పంపించారు.
ఇవీచూడండి:పట్టణ, గ్రామ రహదారులన్నీ నిర్మానుష్యం
Last Updated : Mar 23, 2020, 8:37 AM IST