తెలంగాణ

telangana

ETV Bharat / city

మైనార్టీలకు కాంగ్రెస్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది: రేవంత్ - తెరాస, ఎంఐఎంపై రేవంత్ రెడ్డి ఆరోపణలు

తెరాస, ఎంఐఎం కలిసి రాష్ట్రంలో భాజపా ఎదుగుదలకు సహకరిస్తున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ నిర్వహించిన మీట్ ది ప్రెస్​లో పాల్గొన్నారు.

pcc working president revanth reddy comments on trs, mim in meet the press
కాంగ్రెస్​ను దెబ్బతీస్తే కేటీఆర్​కు మార్గం సుగమం: రేవంత్

By

Published : Nov 29, 2020, 3:35 PM IST

మైనార్టీలకు కాంగ్రెస్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరయ్యారు. గోబెల్స్ సోదరులుగా మారిన మోదీ, అమిత్ షా... హైదరాబాద్ పేరు మారుస్తామని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

ఓవైసీ మాటలు విని మోనార్టీలు తెరాసకు ఓటేస్తున్నారు. ముస్లింల ఓట్లతో తెరాస ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తోందని ఆరోపించారు. ఎంఐఎం కూడా భాజపాకు సహరిస్తోందని విమర్శించారు. తెరాస, ఎంఐఎం కలిసి కాంగ్రెస్​ను బలహీనపరచడం వల్లే భాజపా ఎదడగం, కేటీఆర్​కు మార్గం సుగమం అవుతుందని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. వరద సమయంలో రాని భాజపా నేతలంతా ఇప్పుడు క్యూ కట్టారని దుయ్యబట్టారు.

ఇదీ చూడండి:మోదీ కరోనా డ్రామా... కేసీఆర్ సభ అట్టర్​ ఫ్లాప్: ఉత్తమ్

ABOUT THE AUTHOR

...view details