రాష్ట్రంలో ఉన్నత విద్యావ్యవస్థ నిర్వీర్యం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ కోరారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించాలని డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించండి: పొన్నం - తెలంగాణలో విశ్వవిద్యాలయాలకు వీసీలు కరవు
రాష్ట్రంలోని విద్యావ్యవస్థపై గవర్నర్ జోక్యం చేసుకోవడం శుభపరిణామమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన నుంచి వీసీలను నియమించలేదని ఆరోపించారు.
![విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించండి: పొన్నం ponnam prabhakar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10504418-299-10504418-1612476589025.jpg)
విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించండి: పొన్నం
తెరాస అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిని నియమించలేదని ఆరోపించారు. వీసీల నియామకంపై గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకోవడం శుభపరిణామన్నారు. వీలైనంత తొందరగా వైస్ ఛాన్స్లర్లను నియమించాలని గవర్నర్ సూచించడం.. రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. గవర్నర్ జోక్యాన్ని సానుకూలంగా తీసుకోవాలని.. సర్కార్కు సూచించారు.