సెప్టెంబర్ 17కు భాజపా, ఎంఐఎంలకు సంబంధం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆ రెండు పార్టీలు మతపరమైన రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది... హైదరాబాద్ సంస్థానం విలీనంలోనూ కాంగ్రెస్‌కే సంబంధం ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు.
భాజపా, ఎంఐఎం పార్టీలవి మత రాజకీయాలు: ఉత్తమ్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్తలు
హైదరాబాద్ సంస్థానం విలీనంలో తెరాస, భాజపాకు ఎలాంటి సంబంధం లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భాజపా, ఎంఐఎంలు మతపరమైన రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు.
రాష్ట్రం వచ్చాక కల్వకుంట్ల కుటుంబమే లాభపడిందని ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఐక్యమత్యంతో పనిచేసి దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, కుమార్ రావ్, ప్రేమ్ లాల్, బొల్లు కిషన్, ఉజ్మా షకీర్ తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:అమరవీరుల స్ఫూర్తి కేంద్రం నిర్మించాలి: కిషన్‌రెడ్డి