తెలంగాణ

telangana

కాంగ్రెస్​లో క్రమశిక్షణ అతిక్రమణ సహించేది లేదు: కోదండరెడ్డి

కాంగ్రెస్​లో భేదాభిప్రాయాలుంటే పార్టీ వేదికలపైనే ఫిర్యాదు చేయాలని.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ కోదండరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

By

Published : Jun 7, 2021, 7:49 PM IST

Published : Jun 7, 2021, 7:49 PM IST

Pcc Disciplinary Committee
Pcc Disciplinary Committee

కాంగ్రెస్​లో క్రమశిక్షణ అతిక్రమణ చర్యలను సహించేది లేదని పీసీసీ క్రమశిక్షణ కమిటీ హెచ్చరించింది. ఎవరైనా పార్టీ నియమావళి ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని.. కమిటీ ఛైర్మన్​ కోదండరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ పరంగా, నేతల నుంచి ఏం సమస్యలున్నా.. డీసీసీ, పీసీసీ స్థాయిల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

కోదండరెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. కో ఛైర్మన్​ శ్యామ్​ మోహన్​, కన్వీనర్​ కమలాకర్​రావు, సభ్యులు సంబాని చంద్రశేఖర్​, సీజే శ్రీనివాస్​ హాజరయ్యారు. నేతలపై అందుతున్న ఫిర్యాదులు, తీసుకుంటున్న చర్యలపై కమిటీ చర్చించింది. పార్టీ నాయకత్వానికి, సీనియర్​ నేతలకు వ్యతిరేకంగా కొందరు కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. కాంగ్రెస్​ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని.. ఎవరికైనా భేదాభిప్రాయాలుంటే పార్టీ వేదికల్లో ఫిర్యాదు చేయాలని కమిటీ సూచించింది. తీవ్రత ఆధారంగా ఏఐసీసీ దృష్టికి కూడా తీసుకెళ్లవచ్చునని కమిటీ ఛైర్మన్​ కోదండరెడ్డి సూచించారు.

ఇదీచూడండి:పార్టీ వీడే యోచనలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ

ABOUT THE AUTHOR

...view details