బ్యాలెట్ బాక్సులకు, సీల్‌లకు నంబరింగ్ వేసిన తరువాతనే స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇవాళ్టి గ్రేటర్ ఎన్నికల్లో పెద్ద తప్పిదం జరిగిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్దసారథి దృష్టికి తీసుకెళ్లినట్టు పీసీసీ సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ప్రతి బ్యాలెట్ బాక్స్‌కు, ప్రతి సీల్‌కు ఒక నంబరు ఉండాలన్నారు. సీల్‌లో పోలింగ్ స్టేషన్ నంబరు, డివిజన్ నంబరుతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ఉందని... కానీ అక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేరు ఉండాలన్నారు.
అవే బాక్సులని ఎలా నిర్ధరించుకోవాలి: మర్రి శశిధర్ రెడ్డి - బ్యాలెట్ బాక్సుల సీల్ నెంబరింగ్పై పీసీసీ సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అనుమానాలు
బ్యాలెట్ బాక్స్‌లకు, ప్రతి సీల్ నెంబరింగ్ ఉండాలని పీసీసీ సమన్వయ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇలా లేకపోవడం వల్ల ఏదైనా కుట్ర దాగుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
![అవే బాక్సులని ఎలా నిర్ధరించుకోవాలి: మర్రి శశిధర్ రెడ్డి pcc coordination committee chairmen marri shashidhar reddy allegations on ballot boxes security](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9731497-thumbnail-3x2-marri.jpg)
అవే బాక్సులని ఎలా నిర్ధరించుకోవాలి: మర్రి శశిధర్ రెడ్డి
ఇప్పుడు బ్యాలెట్ బాక్సులకు, సీల్‌లకు నంబరింగ్ లేకుంటే... కౌంటింగ్ రోజున ఇవే బ్యాలెట్ బాక్స్‌లని ఎలా నిర్దరించుకోవాలని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా బ్యాలెట్ బాక్సులకు, సీల్‌లకు నంబరింగ్ వేసిన తరువాతనే తరలించేలా.... స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఇదీ చూడండి:ముగిసిన గ్రేటర్ పోలింగ్.. ఎల్లుండి ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్