కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా కేసులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల19న రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్‌కు సన్మానాలు చేయాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉత్తమ్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా సూచించారు. 19న రాహుల్ గాంధీ జన్మదినోత్సవ కార్యక్రమాలు నిరాడంబరంగా జరపాలని, ఎలాంటి హంగు ఆర్భాటాలు ఉండకూడదని స్పష్టం చేశారు.
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం- ఉత్తమ్ - ఉత్తమ్ తాజా వార్తలు
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. తెరాస ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తుందని. అణచివేతకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరితే కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధాలు, అరెస్టులు చేస్తూ అణచివేతకు పాల్పడ్డారని మండిపడ్డారు.
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం- ఉత్తమ్
తెరాస ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తుందని. అణచివేతకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరితే కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధాలు, అరెస్టులు చేస్తూ అణచివేతకు పాల్పడ్డారని మండిపడ్డారు.
ఇవీ చూడండి:తక్కువ ధరకే మాస్కులు... నకిలీ పత్రాలతో పక్కా ప్లాన్