వలస కూలీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకురాలు ఇందిరారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ కింగ్ కోఠిలో 300 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వలస కార్మికులకు ఉచితంగా ఆహారం, ఆశ్రయం, రవాణా కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ.. అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్ మండిపడ్డారు.
'వలస కూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు' - పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ వార్తలు
హైదరాబాద్ కింగ్ కోఠిలో 300 మంది నిరుపేదలకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వలస కార్మికులకు ఉచితంగా ఆహారం, ఆశ్రయం, రవాణా కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ.. అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్ మండిపడ్డారు.
వలస కూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
రాష్ట్రంలో వలస కూలీలను ఆదుకుంటామని కేసీఆర్ చెప్పినా.. అది అమలు చేయలేకపోయారని విమర్శించారు. ఇప్పటికీ రాష్ట్రంలో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.