లాక్‌డౌన్ సమయంలో పేదల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వం కరెంటు బిల్లులను మూడింతలు చేసిందని ధ్వజమెత్తారు. ఒకేసారి మూడు నెలల బిల్లులు రీడింగ్ తీయడం వల్ల స్లాబ్‌లు మారిపోయాయని ఫలితంగా ప్రజలపైనే భారం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. టెలిస్కోప్ విధానాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. చిన్న వ్యాపారుల కరెంటు బిల్లులనూ ప్రభుత్వమే భరించాలన్నారు. విద్యుత్ బిల్లుల పెంపుపై ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది.
పేదల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్ - congess protest on power bills
లాక్‌డౌన్ సమయంలో పేదల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ డిమాండ్ చేశారు. చిన్న వ్యాపారులనూ ఆదుకోవాలని తెరాస ప్రభుత్వాన్ని కోరారు.

పేదల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్
పేదల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్