పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ వైఫల్యం చెందారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమైతే.. సీఎం రాజీనామా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రాయలసీమకు నీళ్లు తీసుకుపోతా అని ప్రకటన చేస్తే... కేసీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కృష్ణానది జలాల్లో తెలంగాణకు వాటా రాకుంటే.. కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పోతిరెడ్డిపాడుపై వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తా..:ఉత్తమ్ - uttam kumar quetion to kcr
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై వ్యక్తిగతంగా పోరాటం చేస్తానని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
పోతిరెడ్డిపాడుపై వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తా..:ఉత్తమ్
సుప్రీంలో ప్రభుత్వం వేసిన వ్యాజ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేందుకు ఒక్క అంశం కూడా లేదని విమర్శించారు. ఆ పిటిషన్లో కర్ణాటక, మహారాష్ట్రను ఎందుకు చేర్చారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు అంశంపై వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తానని ఉత్తమ్ ప్రకటించారు.
ఇవీచూడండి:ఏపీ ప్రభుత్వ జీవోలపై న్యాయపోరాటం: కర్నె