తెలంగాణ

telangana

ETV Bharat / city

'కేసీఆర్​ నిర్లక్ష్యం వల్లనే వందల సంఖ్యలో కరోనా కేసులు' - కాంగ్రెస్​ శ్రేణులకు ఉత్తమ్​ సూచన

ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్లక్ష్యం కారణంగానే వందల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. కొవిడ్‌ నిబంధనలను పాటించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

uttam kumar reddy
'కేసీఆర్​ నిర్లక్ష్యం వల్లనే వందల సంఖ్యలో కరోనా కేసులు'

By

Published : Jun 23, 2020, 5:46 AM IST

కరోనా విషయంలో సీఎం కేసీఆర్​ మొదటి నుంచీ నిర్లక్ష్యం వహించడం వల్లనే వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తుండడంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటించాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కరోనా బారిన పడకుండా భౌతిక దూరం పాటించడం, మాస్కులు, తరచూ చేతులకు శానిటైజ్‌ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు సమాజాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూడాలని కార్యకర్తలకు ఉత్తమ్‌ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details