ఖమ్మం జైలులో మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanthreddy) ఆరోపించారు. మానవ హక్కులను ఉల్లంఘించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు.
Revanth reddy: వారిని తక్షణమే సస్పెండ్ చేయాలి - రేవంత్ రెడ్డి వార్తలు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanthreddy).. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఖమ్మం జైల్లో ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించి, మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి
సెప్టెంబర్ 17లోపు పోడు భూములకు పట్టాలివ్వాలని.. రాష్ట్రంలోని ఎస్సీ, గిరిజనులకు రూ.10లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఐటీడీఏల పునరుద్ధరణకు నిధులు విడుదల చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంపై పోరు కొనసాగిస్తామని రేవంత్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Etela Rajender: నా ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధం.. హరీశ్‌కు ఈటల సవాల్