Revanth Letter To CM KCR: నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఎఎస్ అధికారి రజత్ కుమార్, షెల్ కంపెనీల మధ్య ఆర్థిక లావాదేవీపై న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్నఇతర అధికారులతో పాటు, ప్రభుత్వంలోని పెద్దలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు.
Revanth Letter To CM KCR: 'రజత్ కుమార్‌ను విచారించాలి'.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ..
Revanth Letter To CM KCR: సీఎం కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్పందించకుంటే ఆయన వ్యవహార శైలిని కూడా ప్రజలు అనుమానించే పరిస్థితి ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు.
pcc chief Revanth reddy Letter To CM KCR about allegations on rajath kumar
తాను చేస్తున్న డిమాండ్లపై ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్పందించకుంటే ఆయన వ్యవహార శైలిని కూడా ప్రజలు అనుమానించే పరిస్థితి ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కొంతకాలంగా జరుగుతోన్న ప్రచారం నిజమని విశ్వసించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రజత్ కుమార్ కుమార్తె పెళ్లి ఖర్చులను కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్, మరికొన్ని షేల్ కంపెనీలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: