ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కుల, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా జనసేన పార్టీపై దాడులు చేస్తున్నారని ఆ పార్టీ అధినేత పవన్ విమర్శించారు. మత్స్యపురి పంచాయతీ పరిధిలో గత రాత్రి జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులపై దాడులను ఆయన ఖండించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే.. ఇళ్లమీదకు వచ్చి దాడులకు తెగబడతారా? అని ప్రశ్నించారు.
వ్యతిరేకంగా పోటీ చేస్తే దాడులకు తెగబడతారా?: పవన్ - పవన్ కల్యాణ్ న్యూస్
పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుదారులకు వ్యతిరేకంగా పోటీ చేస్తే.. ఇళ్ల మీదకు వచ్చి దాడులకు తెగబడతారా ? అని జనసేన అధినేత పవన్.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా మత్స్యపురి పంచాయతీ పరిధిలో గత రాత్రి జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులపై దాడులను ఆయన ఖండించారు.
pawankalyan-fire-on-bhimavaram-issue
కుల, మతాలకు అతీతంగా ప్రజలు జనసేనకు మద్దతుగా నిలవటాన్ని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఓర్వలేకపోతున్నారన్నారు. జనసేన పార్టీ దాడులకు భయపడదని.., ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. బాధితులకు అండగా జనసేన ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.