తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచి పవన్‌ కల్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర - Pawan Kalyan visits Anantapur

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏపీలోని సత్యసాయి పుట్టపర్తి జిల్లా కొత్తచెరువు నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడాది కాలంలో 28 మంది కౌలు రైతులు మృతి చెందగా.. ఆయా రైతుల కుటుంబాలను పరామర్శించి.. రూ.లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.

నేటి నుంచి పవన్‌ కల్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర
నేటి నుంచి పవన్‌ కల్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్ర

By

Published : Apr 12, 2022, 6:10 AM IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కౌలు రైతుల భరోసా యాత్రను నేడు ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో కొత్త చెరువు నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం అందిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

ఏయే జిల్లాల్లో ఎంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలను జనసేన యంత్రాంగం ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం కింద సేకరించింది. ఆ సమాచారం ప్రకారమే ఆయా జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్‌ కలుసుకోనున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎంతో కొంత సాయం చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానంటూ.. ఇందుకు తన వంతు సాయంగా ఆయన రూ.5 కోట్లు పార్టీకి విరాళం ప్రకటించారు.

పవన్‌ నేడు ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్త చెరువు వెళ్తారు. అక్కడ బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి.. సాయం అందిస్తారు. ఆ తర్వాత ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామం చేరుకుంటారు. అక్కడి నుంచి అనంతపురం రూరల్‌ మండలం పూలకుంట, మన్నీల గ్రామాలను చేరుకుంటారు. ఈ అన్నిచోట్లా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.

పరామర్శల అనంతరం మన్నీల గ్రామంలో రచ్చబండ నిర్వహిస్తారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మరికొందరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుంటారు.

ఇవీ చదవండి..

Cabinet Meeting: నేడు కేబినెట్ భేటీ.. ధాన్యం కొనుగోళ్లపై ఇక తుది నిర్ణయం..!

పుల్వామా నిందితుడిని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details