Pawan Tweet on AP Politics : ఏపీలో పొత్తులాట మొదలైన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. జనసైనికులు, ప్రజలనుద్దేశించి పెట్టిన ఆ ట్వీట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే..?
Pawan Kalyan Tweet : 'అది మైండ్ గేమ్‌లో ఒక భాగమే' - Pawan Tweet on Alliance with TDP
Pawan Tweet on AP Politics : జనసైనికులు, ప్రజలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అది మైండ్ గేమ్‌లో ఒక భాగమే అని తెలుసుకోవాలని పవన్ ట్వీట్ చేశారు.
Pawan Kalyan Tweet
‘రాజకీయ నాయకుల తీరు ఒక్కసారిగా మారితే.. దాని వెనకాల ఉన్న కారణాలు తెలుసుకోవాలి. అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు ఒక్కసారిగా పొగడటం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని భావించి చప్పట్లు, ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటివరకు తిట్టిన వారు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ఆలోచించాలి. పొగుడుతున్నారని ఆ నాయకుడిని ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్‌లో ఒక భాగమే’ అని తెలుసుకోవాలని పవన్ ట్వీట్ చేశారు.