తెలంగాణ

telangana

ETV Bharat / city

Pawan on Repeal three capital law: జగన్‌ ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర లేపింది - high court on amaravati cases

ఏపీలో మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ, అసెంబ్లీలో సీఎం జగన్​ ప్రకటనపై జనసేన అధినేత పవన్ (pawan kalyan comments on three capital law repeal)​ స్పందించారు. కోర్టు తీర్పుతో గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో (pawan fires on ycp govt) వైకాపా ప్రభుత్వం కొత్త నాటకానికి తెర లేపిందని మండిపడ్డారు.

pawan kalyan comments on 3 capitals
pawan kalyan

By

Published : Nov 22, 2021, 10:48 PM IST

మూడు రాజధానుల అంశంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan comments on three capital law repeal) స్పందించారు. 3 రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్.. మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని విమర్శించారు. రాజధాని అమరావతికి సంబంధించి 54 కేసుల్లో హైకోర్టు (ap high court on amaravati cases)లో విచారణ జరుగుతుందని.. ఓటమి తప్పదని గ్రహించిన ప్రభుత్వం బిల్లుల రద్దుకు ఉపక్రమించిందన్నారు.

కొత్త నాటకానికి తెర లేపింది..

కోర్టు తీర్పుతో గందరగోళానికి తెరపడుతుందని భావిస్తున్న తరుణంలో వైకాపా ప్రభుత్వం కొత్త నాటకానికి తెర లేపిందని పవన్ అన్నారు. ఉమ్మడి ఏపీ విడిపోయి ఏడున్నర సంవత్సరాలు గడుస్తున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వివిధ రాష్ట్రాలను ఉదాహరణగా చూపిస్తున్న పాలకులు ఏ రాష్ట్రంలోనూ రెండు, మూడు రాజధానులు లేవనే విషయాన్ని విస్మరించారని జనసేనాని ఆక్షేపించారు. 3 రాజధానుల ఏర్పాటుతోనే అభివృద్ధి జరుగుతుందన్న భ్రమలోనే వైకాపా పెద్దలు మునిగి తేలుతున్నారని ఎద్దేవా చేశారు.

'33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలంటే మౌలిక వసతులకు తక్కువలో తక్కువ రూ.లక్ష కోట్లు అవసరమవుతాయి. అది వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులపై పలు చోట్ల లాఠీ ఛార్జీ చేసి భయానికి గురిచేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3వేలకు పైగా కేసులు పెట్టారు. మహిళలపైనా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. ఒకే రాజధాని కావాలని ఏపీలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఒకే మాటపై నిలిస్తే ఒక్క వైకాపా మాత్రమే మూడు రాజధానుల పాట పాడింది. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలను ఇచ్చి త్యాగనిరతిని చాటిన అమరావతి రైతులకు జనసేన బాసటగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు రాష్ట్రమంతటికీ విస్తరించాలని, రాజధాని మాత్రం అమరావతి ఒక్కటే ఉండాలని జనసేన కోరుకుంటోంది. తాత్కాలిక ప్రయోజనంతో కాకుండా దూరదృష్టితో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాజధానికి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి’

- పవన్ కల్యాణ్, జనసేన అధినేత

ఇదీచూడండి:Amaravati capital news: 'వికేంద్రీకరణే మా ప్రభుత్వ ఉద్దేశం, త్వరలో కొత్త బిల్లుతో వస్తాం..'

ABOUT THE AUTHOR

...view details