తెలంగాణ

telangana

ETV Bharat / city

స్టీల్ ప్లాంట్ కోసం వైకాపా నిరసనలు.. ఎన్నికల స్టంట్​: పవన్ - విశాఖ స్టీల్​ ప్లాంట్​పై పవన్ కామెంట్స్

ఏపిలోని విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై అధికార పార్టీ నాయకులు చేస్తున్న నిరసనలు కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. 22 మంది వైకాపా ఎంపీలకు రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే స్టీల్ ప్లాంటు కోసం ఏం చేస్తారన్నది.. పార్లమెంట్ సాక్షిగా చెప్పాలన్నారు.

pawan-kalyan-on-vishaka-steel-plant
స్టీల్ ప్లాంట్ కోసం వైకాపా నిరసనలు.. ఎన్నికల స్టంట్​: పవన్

By

Published : Mar 7, 2021, 4:01 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ స్టీల్​ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైకాపా ఎంపీలు దిల్లీలో మాట్లాడటానికి భయపడి... ఇక్కడ మాత్రం ఓట్ల కోసం నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వారిని ప్రజలెవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరని అన్నారు. దేశంలో ఉన్న అన్ని పరిశ్రమల్లాగే విశాఖ ఉక్కు పరిశ్రమను చూడొద్దని.. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ అంశంగా అంశమని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రత్యేక దృష్టితో చూడలని తనే స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చెప్పి, వినతిపత్రం ఇచ్చానని పవన్​ తెలిపారు. ఈ ప్రజా ఉద్యమాన్ని వైకాపా ఎంపీలు కేంద్రం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఏ త్యాగాలు చేస్తే పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు విషయంలో ప్రజలు కోరుకునే విధంగా జనసేన పార్టీ అండగా ఉండి చివరి వరకు పోరాడుతుందని తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి:ఆ వివాహానికి పటిష్ఠ పోలీస్ భద్రత.. కారణమిదే?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details