ఏపీలో అవినీతి, శాంతిభద్రతల సమస్యపై జేపీ నడ్డాతో చర్చించామని పవన్ తెలిపారు. చివరి రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందన్నారు. ఆలయాలపై దాడుల విషయమై చర్చించామని పేర్కొన్నారు. కమిటీ వేసి ఎలా ముందుకు వెళ్లాలో చర్చించామని.. రాష్ట్రానికి ఎలా మేలు చేయాలనే అంశాలపై మాట్లాడామని పవన్ తెలిపారు.
అవినీతి, శాంతిభద్రతల సమస్యపై జేపీ నడ్డాతో చర్చించాం: పవన్ - తిరుపతి ఉపఎన్నిక జనసేన అభ్యర్థి తాజా వార్తలు
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వానం మేరకు దిల్లీకి వచ్చామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం గురించి చర్చించామని తెలిపారు. భాజపా, జనసేన కలిసి రాష్ట్రంలో అధికారంలోకి ఎలా తీసుకురావాలో చర్చించామని పవన్ పేర్కొన్నారు.
తిరుపతి ఉపఎన్నికల్లో.....భాజపా- జనసేన కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థి ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే అంశాన్ని..మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాన్ తెలిపారు. ఉమ్మడిగా కమిటీ వేసి అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. నడ్డాతో పాటు మరికొంత మంది సీనియర్ నాయకులతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు విషయాలపై చర్చించామన్న పవన్.. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలని...ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చకూడదని చెప్పామని పవన్ తెలిపారు.
ఇదీ చదవండి:పెనుతుపానుగా నివర్- ఈదురుగాలుల బీభత్సం