తెలంగాణ

telangana

ETV Bharat / city

జగన్..​ కేసీఆర్​ను చూసి నేర్చుకో: పవన్​ ట్వీట్​ - cm kcr pawan kalyan

తెలుగు భాష, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని వైకాపా నాయకత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. 2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తెలుగు మహాసభల’ కోసం 'తొలిపొద్దు' అనే పుస్తకాన్ని తీసుకువచ్చారని ట్వీట్ చేశారు.

pavan

By

Published : Nov 10, 2019, 11:25 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధించాలనే ఏపీ ప్రభుత్వ విధానం.. తన గ్రంథాలయంలోని తెలుగు పుస్తకాలను ఎంతో ఆరాధనతో, ప్రేమతో, శ్రద్ధతో చూసేలా చేసిందని జనసేనాని అన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని నిజంగా అర్థం చేసుకుని ఉంటే.. ఆంగ్ల విధానం నిర్ణయం తీసుకునే వారు కాదని అభిప్రాయపడ్డారు. భాష, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని జగన్​కు సూచించారు. ఈ సందర్భంగా పలు తెలుగు పుస్తకాల ముఖ చిత్రాలను పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పొస్ట్ చేశారు.

పవన్ కల్యాణ్​ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details