ఏపీలో రైతుల దుస్థితిపై జనసేనాని ఏమంటున్నారు? - నివర్ తుపాను బాధితులకు నష్టపరిహారంపై పవన్ కామెంట్స్
నివర్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా ఎకరాకు రూ.35 వేలు ఇవ్వాల్సిందేనని... జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఎన్ని మార్గాల్లో పోరాడినా.. ఏపీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకుంటే... అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఏపీలో రైతుల దుస్థితిపై జనసేనాని ఏమంటున్నారు?
కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం మాట్లాడితే... అధికార పార్టీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీ రాష్ట్రంలో రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయని పరిస్థితి ఉందని.. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ వ్యాఖ్యానించారు.
- ఇదీ చదవండి : 'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్‌కు చెప్పండి'