Pawan kalyan tweet: జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్టు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ.. శాంతి-యుద్ధంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం, శాంతి గురించి తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"ఒక మార్పుకోసం యుద్ధం చేయాల్సి వస్తే.. 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను. నూరవసారే యుద్ధం చేస్తాను" అంటూ.. తన ఆలోచనా విధానాన్ని ట్వీట్ చేశారు పవన్. ఈ కోట్కు.. కలంతో పుస్తకంలో రాసుకుంటున్న తన చిత్రాన్ని జోడించారు.