ఏపీలోని కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కంకిపాడు - గుడివాడ రహదారి మీదుగా పవన్‌కల్యాణ్ ర్యాలీ జరుగుతోంది. గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్నానికి పవన్ చేరుకోనున్నారు. మార్గమధ్యలో రైతులను కలుస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు.
నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న జనసేనాని - ap news
ఏపీలోని కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పర్యటిస్తున్నారు. నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పవన్ పరామర్శిస్తున్నారు. రైతన్నలు తమ కష్టాలను విన్నవిస్తున్నారు.

నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న జనసేనాని
నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం పెంచాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. పంటనష్టం పరిహారం పెంచాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. నందమూరు క్రాస్ రోడ్డు వద్ద మహిళలు పవన్‌కు హారతులు పట్టారు. రైతన్నలు తమ కష్టాలను ఆయనకు వివరించారు. పంటనష్టానికి పరిహారం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు.