తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రభుత్వం ఏం చేసినా.. డూడూ బసవన్నలా తల ఊపాలా?' - pawan kalyan latest news

Pawan kalyan fires on YSRCP: ఏపీ ఉద్యోగులు ఆందోళన చేస్తే జనసేనపై విమర్శలు సరికాదని.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఉద్యోగులు తమకు రావాల్సిందే అడుగుతున్నారని పవన్ స్పష్టం చేశారు.

pawan kalyan
pawan kalyan

By

Published : Feb 9, 2022, 10:45 PM IST

Pawan kalyan fires on YSRCP: ఉద్యోగులు తమకు రావాల్సిందే అడుగుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. ఉద్యోగులు ఆందోళన చేస్తే జనసేనపై విమర్శలు సరికాదని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఏం చేసినా.. డూడూ బసవన్నలా తల ఊపాలా? అని ధ్వజమెత్తారు జనసేనాని.

'ఏపీ ప్రభుత్వం పద్ధతిగా ఉంటే ఉద్యోగులు రోడ్లపైకి ఎందుకొస్తారు. మంత్రులు అందరూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మరింత సమర్థంగా పనిచేయాలని కోరుకుంటాం. ఉద్యోగులకు న్యాయం జరగాలనే మద్దతు తెలిపాం.'

-పవన్ కల్యాణ్‌, జనసేన అధినేత

త్వరలో నరసింహ క్షేత్రాల సందర్శన యాత్ర..
తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షిస్తూ.. నరసింహ సందర్శన యాత్ర మొదలుపెట్టనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. దశలవారీగా 32 నరసింహ క్షేత్రాల సందర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. కొండగట్టు స్వామిని దర్శించుకున్నాక యాత్ర మొదలుపట్టి.. ధర్మపురి, నాంపల్లి క్షేత్రాల నుంచి నరసింహయాత్రను ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు.

ఇదీచూడండి:AP PRC Steering Committee: 'మేం సమ్మెను విరమించుకున్నాం.. మీరు చేయవచ్చు కదా..?

ABOUT THE AUTHOR

...view details