తెలంగాణ

telangana

ETV Bharat / city

'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్​కు చెప్పండి' - pawan kalyan demands for cyclone relief package

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తక్షణ సాయం కింద రూ.పది వేలు ఇవ్వాలన్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు పరిహారం ఇచ్చేందుకు సమయం ఇస్తున్నామని...ఆదుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని స్పష్టం చేశారు.

pawan-kalyan-fiers-on-ycp-govt-over-farmers-problems
'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్​కు చెప్పండి'

By

Published : Dec 28, 2020, 6:20 PM IST

'వకీల్ సాబ్ వచ్చాడని మీ సీఎం సాబ్​కు చెప్పండి'

రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులకు మేలు చేయకుంటే మీకున్న 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. ఏపీలోని మచిలీపట్నం ర్యాలీలో మాట్లాడిన ఆయన... వరద బాధిత రైతులకు రూ. 35వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని రైతుల సంక్షేమానికి కేటాయించాలన్నారు. తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని హెచ్చరించారు. వరద బాధిత రైతులకు తక్షణమే రూ. 10వేలు విడుదల చేయాలన్నారు.

'రైతులకు పరిహారం చెల్లించకపోతే అసెంబ్లీ ముట్టడి తప్పదు. వైకాపా నేతలు.. వకీల్ సాబ్ వచ్చాడనే విషయాన్ని మీ సీఎంకు చెప్పండి. వైకాపా నేతలు వ్యాపారం చేసుకోవచ్చు.. మేం సినిమాలు చేయకూడదా? వైకాపా నేతలు పేకాట క్లబ్బులు నడిపిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. సీఎం జగన్‌కు పరిశ్రమలు లేవా.. వ్యాపారాలు లేవా..?మైనింగ్, ఇసుక దందాలకేనా 151 మంది వైకాపా ఎమ్మెల్యేలు ఉన్నారు. సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. మరీ వైకాపా నేతలు చేస్తున్నదేంటి...దేశసేవా...?- పవన్ కల్యాణ్, జనసేన అధినేత

రాష్ట్ర ఉత్పత్తిలో 40శాతం రైతు నుంచే వస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. రైతులు కన్నీరు కారుస్తుంటే అడగకూడదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలలోపు రైతులకు రూ.35వేలు ఇవ్వకపోతే... శాసనసభను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సమావేశాలు విశాఖ, విజయవాడ లేదా పులివెందులలో ఎక్కడ నిర్వహించినా.. తమ అసెంబ్లీ ముట్టడిని ఆపలేరని హెచ్చరించారు. తాము అసెంబ్లీ ముట్టడిస్తే ఏదైనా జరగవచ్చని స్పష్టం చేశారు. మంత్రి పదవిని కాపాడుకునేందుకు తనపై మంత్రి పేర్ని నాని విమర్శలు చేస్తున్నారని అన్నారు. తుపాన్​తో రైతులు నష్టపోతే మంత్రి నాని ఒక్కరికైనా వెయ్యి రూపాయలు ఇచ్చారా అని నిలదీశారు.

రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టాను. ఎన్నికల్లో ఒటమి చెందినా నేను వెనకడుగు వేయలేదు. రాజకీయం అంటే కుటుంబం, కులానిదో కాదు..అన్ని కులాలు, కుటుంబాలది. వైసీపీలో నానిలు ఎక్కువ... శతకోటి నానిలో ఓ నాని ఇక్కడి ఎమ్మెల్యే. వైకాపా నేతలు.... వకీల్ సాబ్ వచ్చాడని...మీ సీఎం సాబ్​కు చెప్పండి - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

కలెక్టరేట్​లో వినతిపత్రం

మచిలీపట్నం కలెక్టరేట్‌లో పవన్ కల్యాణ్ వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఇంతియాజ్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్‌వో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చారు. నివర్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం పెంచాలని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details