Pawan Kalyan Fell Down: తమ అభిమాన హీరో కళ్ల ముందుకొచ్చే సరికి ఉప్పొంగిపోయాడు ఓ అభిమాని. తాను అమితంగా అభిమానించే హీరోను అతి సమీపం నుంచి చూస్తానని ఊహించి ఉండడు. కానీ అదే నిజమైన వేళ అవధుల్లేని ఆనందానికి లోనయ్యాడు. కారుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న జనసేనని పవన్‌ను తాకాలనే ఉత్సాహంతో భద్రతను ఛేదించి కారుపైకి ఎక్కి పవన్ వద్దకు దూసుకెళ్లాడు.
Pawan Kalyan Fell Down: ఫ్యాన్ అత్యుత్సాహం... కిందపడ్డ పవన్ కల్యాణ్ - pawan kalyan fell down from car because of his fan'
Pawan Kalyan Fell Down: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో.. అపశృతి నెలకొంది. ఓ అభిమాని చేసిన పనికి.. పవన్ కారుపైనే పడిపోయారు.
Pawan Kalyan
పరిగెత్తుకొచ్చిన వేగంలోనే పవన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో.. ఒక్కసారిగా జనసేనానితో సహా తానూ కిందపడిపోయాడు. ఈ ఘటన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో చోటు చేసుకుంది. కారుపైనే పడిపోయిన పవన్.. వెంటనే తేరుకుని పైకి లేచారు. ఈ ఘటనతో పవన్‌తో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే.. పవన్ సురక్షితంగా పైకిలేవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి :ముంబయిలో ఉద్ధవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ