పవన్‌కల్యాణ్ అభిమాని మృతి.. పాడె మోసిన మంత్రి, మాజీ మంత్రి - pawan kalyan fan died with heart attack news
ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దాసరి లక్ష్మణ రావు(బుడ్డా) గుండెపోటుతో మృతిచెందారు. ఆయన అంతిమయాత్రలో ఏపీ మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన సుధా ఫొటో స్టూడియో యజమాని సుధాకర్ మరణించారు. ఆయన పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దాసరి లక్ష్మణరావుకు సన్నిహితుడు. సుధాకర్ మరణవార్తతో లక్ష్మణరావు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఆ బాధలోనే గుండెపోటుకు గురైనట్లు లక్ష్మణరావు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం అంతిమయాత్ర నిర్వహించగా ఏపీ మంత్రి పేర్ని నానితోపాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని పాడె మోశారు. పలువురు నగర ప్రముఖులు లక్ష్మణరావుకు నివాళులర్పించారు.