తెలంగాణ

telangana

ETV Bharat / city

మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నా...: పవన్​ కల్యాణ్ - pawan latest news

PAWAN: పెద్దల సభకు నామినేట్​ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, వీరేంద్ర హెగ్గడే, పి.టి.ఉషకు జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అభినందనలు తెలిపారు. వారు మన దేశ పేరు, ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన శ్రేష్ఠులని కొనియడారు.

pawan-kalyan-congratulates-the-new-nominated-members-of-rajya-sabha
pawan-kalyan-congratulates-the-new-nominated-members-of-rajya-sabha

By

Published : Jul 7, 2022, 4:58 PM IST

PAWAN: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్గడే, పి.టి.ఉషలను ఎంపిక చేశారనే వార్త ఎంతో ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్​ కల్యాణ్ అన్నారు. రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వర జ్ఞాని ఇళయరాజా, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, సామాజిక సేవకులు వీరేంద్ర హెగ్గడే, పరుగుల రాణి పి.టి.ఉష.. తమ రంగాల్లో మన దేశ పేరు, ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన శ్రేష్ఠులని కొనియడారు. వీరి సేవలు, అనుభవాన్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ప్రకటించారు.

పెద్దల సభకు నలుగురు ప్రముఖులు: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్​ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డే ఆ జాబితాలో ఉన్నారు. ఆయ రంగాలో వీరు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వి.విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజ, పి.టి. ఉష, వీరేంద్ర హెగ్గడేను పెద్దల సభకు ఎంపిక చేసింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details