తెలంగాణ

telangana

ETV Bharat / city

తూర్పుగోదావరి పర్యటనకు జనసేనానికి అనుమతి - pawan tour news

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు పోలీసుల అనుమతి లభించింది. పర్యటనకు అనుమతి లేదంటూ..జిల్లా ఎస్పీ నయీం అస్మీ తొలుత వెల్లడించారు. కొన్ని గంటల ఉత్కంఠ అనంతరం పర్యటనకు అనుమతి లభించినట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

pawan kalyan
తూర్పుగోదావరి పర్యటనకు జనసేనానికి అనుమతి

By

Published : Jan 8, 2021, 10:23 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు పోలీసులు అనుమతిచ్చారు. దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న వారిని పరామర్శించేందుకు శనివారం.. పవన్ కొత్తపాకలలో సభ తలపెట్టారు. అందుకు అనుమతి లేదంటూ జిల్లా ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు. అయితే కొన్ని గంటల ఉత్కంఠ తర్వాత పర్యటనకు అనుమతి లభించినట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

అంతకు ముందు..సభకు అనుమతి నిరాకరించినట్లు వచ్చిన ప్రకటనపై ట్విట్టర్‌ ద్వారా స్పందించిన జనసేనాని.. శనివారం ఉదయం రాజమహేంద్రవరం చేరుకుంటానని..కార్యక్రమాలకు హాజరవుతానన్నారు. అనుమతి నిరాకరణను నాదెండ్ల మనోహర్‌ కూడా ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అనుమతి నిరాకరించడంపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవీచూడండి:ధర్మాన్ని పరిరక్షించాలి.. పరీక్షించకూడదు: సచ్చిదానంద స్వామి

ABOUT THE AUTHOR

...view details