తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప వంగేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలోని రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉందని... ప్రజలకు ఉన్న హక్కునూ ఎవరూ ఆపలేరని పవన్‌కల్యాణ్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కును అడ్డుకోలేరని సూచించారు. వీర మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడమే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నట్టు ఉద్ఘాటించారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండాలని వచ్చినట్టు స్పష్టం చేశారు.
నా సహనాన్ని తేలిగ్గా తీసుకోకండి..
"రాజకీయ పార్టీ నడపటం అంత సులువు కాదు. శ్రమదానం నాకు సరదా కాదు. రాజకీయం అనేది కష్టమైన ప్రక్రియ. నేను నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చా. మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వం ఖాజానాకు వెళ్తాయి. ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయి. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే వ్యక్తిని కాదు. పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు."- పవన్‌కల్యాణ్, జనసేన అధ్యక్షుడు
సీఎం అయ్యాకే సీఎం అని పిలవండి..