తెలంగాణ

telangana

ETV Bharat / city

అభిమాని ఇంటికి పవన్ కల్యాణ్.. రూ.ఐదు లక్షల సాయం - అభిమాని ఇంటికి పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కేన్సర్​తో బాధపడుతున్న తన అభిమానిని పరామర్శించి.. ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు.

pawan-kalyan-announces-rs-5-lakh-medical-treatment-for-a-fan-in-krishna-district
అభిమాని ఇంటికి పవన్ కల్యాణ్.. రూ.ఐదు లక్షల సాయం

By

Published : Mar 9, 2021, 10:42 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం లింగాలలో తన అభిమాని ఇంటికి వెళ్లారు. కేన్సర్​తో బాధపడుతున్న భార్గవ్​ను పరామర్శించారు. వైద్య సాయం కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

భార్గవ్​కు ధైర్యం చెప్పి.. వెండి గణపతి విగ్రహాన్ని అందించారు. అతని తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడారు. ఎన్ఆర్​ఐ దాతల నుంచి సాయం అందేలా ఏర్పాట్లు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. పవన్ రాక సమాచారం అందుకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి భారీగా చేరుకున్నారు.

అభిమాని ఇంటికి పవన్ కల్యాణ్.. రూ.ఐదు లక్షల సాయం

ఇదీ చదవండి:విషాదం: 'సాగు' అప్పులు తీర్చలేక రైతు బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details