తెలంగాణ

telangana

ETV Bharat / city

మన కల్చర్.. అగ్రికల్చర్ ఒకటే: పవన్ - ప్రకృతి వ్యవసాయంపై పవన్ కామెంట్స్

మన దేశంలో సంస్కృతి, వ్యవసాయం రెండు ఒక్కటేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మన జీవన విధానంలో, సంస్కృతిలో వ్యవసాయ విధానాలు భాగమేనని చెప్పారు. కాలానుగుణంగా పంటలు... ఆ పంటలు చేతికి వచ్చే వేళల్లోనే పండుగలు చేసుకుంటామన్నారు.

మన కల్చర్.. అగ్రికల్చర్ ఒకటే: పవన్
మన కల్చర్.. అగ్రికల్చర్ ఒకటే: పవన్

By

Published : Sep 10, 2020, 10:15 AM IST

మన కల్చర్... అగ్రికల్చర్ ఒకటే అనే భావనను అంతా పెంచుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. అందులో భాగంగా 'చారడునేల-బతుకుబాట' పేరిట ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా జనసేన చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానంపై రైతు విజయ రామ్ నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నామన్నారు.

దేశంలో మానవ వనరులకు కొదవ లేదని... కోట్లాది మంది జనాభా ఉన్నారని... ఇంతమంది ఉండి కూడా పొలాల్లో కలుపు తీయడానికి మనుషులు లేకుండా పోయారని విజయరామ్‌ అన్నారు. దీంతో కలుపు తీయడానికి భయంకరమైన మందులు వాడుతున్నామని... ఏ పంటను వేసినా.. కలుపు మందుల ప్రభావం కాలేయం, మెదడు మీద పడి క్యాన్సర్ కు గురవుతున్నామన్నారు. ముఖ్యంగా మినుములు పండించడానికి మందులను ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు. కలుపు మందు వాడకుండా పంట పండించుకోవడం పాలేకర్ విధానంలో చాలా సులభమని చెప్పారు. ప్రభుత్వాలు తీసుకొస్తున్న ఉపాధి హామీ వంటి పథకాలను వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతుకు లాభం చేకూరుతుందన్నారు. వ్యవసాయ కూలీలకు ఇస్తున్న 300 రూపాయల్లో ప్రభుత్వం రూ.150, రైతు రూ.150 భరించవచ్చని... రైతే దగ్గరుండి వ్యవసాయ పనులు పూర్తి చేయించుకొనే అవకాశం వస్తుందని.. ఆర్థిక వెసులుబాటు ఉంటుందన్నారు.

ఇవీ చూడండి:పట్టుబడుతున్న లంచావతారాలు.. అవినీతిలో రెవెన్యూ నెంబర్ వన్​

ABOUT THE AUTHOR

...view details