మాతృభాషా పరిరక్షణ, నదుల సంరక్షణ కోసం జనసేన తరఫున 'మన నుడి- మన నది' పేరిట కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ విషయంపై మేధావులు, నిపుణులతో చర్చించామన్నారు. నదిలేనిదే నాగరికత లేదని... భాష లేనిదే సంస్కృతి లేదని పవన్ అభిప్రాయపడ్డారు.
త్వరలో 'మన నుడి- మన నది' కార్యక్రమం: పవన్ - జనసేన కార్యక్రమం
మాతృభాషను కాపాడుకోకపోతే... సంస్కృతికి దూరమవుతామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను... విషమయం చేసుకోవడం బాధాకరమన్నారు.
మన భాషా మూలాల్ని మనమే నరుక్కుంటున్నామని... మాతృభాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతామని పేర్కొన్నారు. నాగరికతకు నది పుట్టినిల్లని... మనిషి మనుగడకూ నదులు కీలకమని అన్నారు. జీవనాధారమైన నదుల్ని చేతులారా విషమయం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషను, నదులను కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేసేలా 'మన నుడి- మన నది'కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.
ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్