తెలంగాణ

telangana

ETV Bharat / city

అన్నదాతను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: పవన్​కల్యాణ్ - వరదలపై పవన్ కామెంట్స్

ఏపీలో భారీ వర్షాలు, వరదలతో రైతులు పంటలు నష్టపోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ అన్నారు. పంటల పెట్టుబడి మొత్తాన్ని పరిహారంగా తక్షణమే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

'పరిహారం అందించడంలో పట్టనట్లు వ్యవహరించడమేంటి?'
'పరిహారం అందించడంలో పట్టనట్లు వ్యవహరించడమేంటి?'

By

Published : Oct 22, 2020, 3:02 PM IST

ఖరీఫ్ సీజన్​లో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసా నీటి పాలైందని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో ఏపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించట్లేదని వ్యాఖ్యానించారు. పరిహారాన్ని అందించడంలో ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతేడాది పరిహారం ఇప్పటికీ చెల్లించలేదని... రైతులు ఆవేదన చెందుతున్నారని పవన్ అన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో జనసేన నాయకులు పర్యటించి పొలాలను పరిశీలిస్తారని తెలిపారు.

ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.71 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి పంట నీట మునిగి కుళ్లిపోతోంది. తక్షణమే పరిహారం చెల్లిస్తే రైతులు తదుపరి పంటకు సంసిద్ధులవుతారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి.

- పవన్ కల్యాణ్, జనసేన అధినేత

ఇదీ చదవండి:వరద బాధితులకు రామోజీ గ్రూప్‌ రూ.5 కోట్ల సాయం

ABOUT THE AUTHOR

...view details