ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల విధానం ఒక మిథ్య అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి కనీసం దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక కేంద్రంగానైనా మార్చలేకపోయారని దుయ్యబట్టారు. ‘ఏపీ-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగు అధికంగా ఉంది. కొన్నేళ్లుగా ఇది జరుగుతున్నా వైకాపా హయాంలోనే రెట్టింపు అయింది. అది ఎంతకు పెరిగిందనేది పోలీసులే చెప్పాలి’ అని పేర్కొన్నారు.‘గంజాయి మొక్కను ఆంధ్రప్రదేశ్ చిహ్నంగా వైకాపా ప్రభుత్వం మార్చేసింది. ఏకంగా గంజాయి కలిపిన సారాను అమ్ముతున్నారు. ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతపై అనుమానాలున్నాయి’ అని పవన్ కల్యాన్ ఆరోపించారు. ‘విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్నారు. ఎక్కడ చూసినా ఈ నాయకులకు భూమి పిచ్చే కనిపిస్తోంది. ముంబయి నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ నౌకలో తక్కువ మోతాదులో ఓ వ్యక్తి నుంచి మత్తు పదార్థాలు లభ్యమైతే కొన్ని ఆధారాలతో అనుమానించి షారుక్‌ఖాన్ కుమారుణ్ని కొద్ది రోజులు జైల్లో పెట్టారు. అటువంటిది ఒక పంట కాలంలో దాదాపు నాలుగు వేల టన్నుల గంజాయి బయటకు వెళ్తుంటే ఎంతమంది నాయకులను, ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విశాఖలో మంగళవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. జన సైనికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొందరు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా.. 2024 నుంచి వచ్చే అయిదు సార్వత్రిక ఎన్నికల్లో తమతో పోరాడడానికి సిద్ధమైతేనే బెదిరించండని హెచ్చరించారు.
అన్ని రాష్ట్రాలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఏపీ మాత్రం గంజాయి అభివృద్ధి వైపు అడుగులు. ఏవోబీలో గంజాయి సాగు ఇప్పుడు బాగా పెరిగింది. మద్య నిషేధం అంటే వైకాపా వాళ్లే అమ్ముతారని అర్థం. జగనన్న ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేశారు. ఇళ్ల లబ్ధిదారులకు కొండలు, శ్మశానాలు చూపించారు.- -పవన్ కల్యాణ్, జనసేన అధినేత
పిల్లలకు పాలు తాగించినట్లు: