తెలంగాణ

telangana

ETV Bharat / city

మేము సైతం అంటున్న పటాన్​చెరు మహిళామణులు - patancheru Symphony Park Homes Colony Women making masks

కరోనా వైరస్​ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా వ్యాప్తి కట్టడికి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించడం ఒక్కటే ఆయుధమని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఫలితంగా మాస్కుల కొరత ఏర్పడింది. కొందరు వ్యాపారులైతే అధిక ధరలకు విక్రయాలు చేస్తూ... అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి తరుణంలో సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు సింఫోనీ పార్క్​ హోమ్స్​ కాలనీ మహిళలు సొంతంగా మాస్కులు తయారు చేసి... ఉచితంగా పంపిణీ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

patancheruvu-womens-making-masks-and-distributed-to-emergency-services-employee
మేము సైతం అంటున్న పటాన్​చెరు మహిళామణులు

By

Published : Apr 15, 2020, 5:44 AM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నివారణలో మేము సైతం అంటూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.... హైదరాబాద్ నగర శివారు మహిళలు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు సింఫోనీ పార్క్ హోమ్స్ కాలనీ మహిళలు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కాలనీ మహిళలు కొందరు కలిసి తమ ఇళ్లలోనే కుట్టు మిషన్​లపై మాస్కులు కుట్టి... కరోనా నివారణలో అహర్నిశలు పనిచేస్తోన్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఉచితంగా అందిస్తున్నారు.

'ప్రొటెక్ట్​ ద ప్రొటెక్టర్స్​' అనే థీమ్​తో 10వేల మాస్కులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే వందల సంఖ్యలో మాస్కులను తయారు చేసి పంపిణీ చేశారు. వీటి తయారీలో వారి పిల్లలు సైతం పాలుపంచుకోవడం హర్షించదగ్గ విషయం.

మేము సైతం అంటున్న పటాన్​చెరు మహిళామణులు

ఇదీ చూడండి:రోడ్లపైకి భారీగా వలస కార్మికులు- పోలీసుల లాఠీఛార్జ్​

ABOUT THE AUTHOR

...view details