ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి ఊరట లభించింది. ఆయనకు గుంటూరు జిల్లా రెండో అదనపు న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఈరోజు జిల్లా జైలు నుంచి ప్రవీణ్ చక్రవర్తి విడుదలయ్యారు.
షరతులతో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల
ఏపీలోని గుంటూరు జిల్లా జైలు నుంచి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల అయ్యారు. ఈ మేరకు కొన్ని షరతులతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారంటూ గత నెలలో ప్రవీణ్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
షరతులతో జైలు నుంచి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి విడుదల
షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన న్యాయంస్థానం... ప్రవీణ్ ప్రతి ఆదివారం సీఐడీ కార్యాలయంలో సంతకం పెట్టాలని, దేశం విడిచివెళ్లరాదని, పాస్‌పోర్టును న్యాయస్థానానికి అప్పగించాలని స్పష్టం చేసింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ.. గత నెల 12న సీఐడీ పోలీసులు ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:ఘట్కేసర్ అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు