తెలంగాణ

telangana

ETV Bharat / city

మే 17 తర్వాతకు పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్​ - పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్లు రీషెడ్యూల్​

పాస్‌పోర్టు సేవలు వచ్చే నెల14వ తేదీ వరకు నిలిపివేసినందున.. అపాయింట్‌మెంట్​లను మే 17 తర్వాతకు రీ షెడ్యూల్‌ చేయనున్నట్లు సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య వివరించారు. దరఖాస్తుదారులు సైతం ప్రస్తుతం పని చేస్తున్న పాస్‌పోర్టు సేవా కేంద్రాలకు వెళ్లి వారి అపాయింట్‌మెంట్​లను రీషెడ్యూల్‌ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.

passport-appointments-rescheduled-after-may-17th
passport-appointments-rescheduled-after-may-17th

By

Published : Apr 30, 2021, 11:32 PM IST

రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా... పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో అపాయింట్‌మెంట్​లను సగానికి తగ్గించినట్లు సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల ద్వారా పాస్‌పోర్టు సేవలు వచ్చే నెల14వ తేదీ వరకు నిలిపివేసినందున.. అక్కడి అపాయింట్‌మెంట్​లను మే 17 తర్వాతకు రీ షెడ్యూల్‌ చేయనున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు సైతం ప్రస్తుతం పని చేస్తున్న పాస్‌పోర్టు సేవా కేంద్రాలకు వెళ్లి వారి అపాయింట్‌మెంట్​లను రీషెడ్యూల్‌ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.

దరఖాస్తుదారులు వెళ్లలేని పరిస్థితులు ఉంటే... ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అపాయింట్‌మెంట్‌ను రీషెడ్యూల్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్ స్లాట్లను 50 శాతానికి కుదించినట్లు వివరించారు. బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలిచౌకి, నిజామాబాద్‌, కరీంనగర్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ఈ కుదింపు అమలులోకి వచ్చినట్లు తెలిపారు. సేవా కేంద్రాల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకే 50 శాతానికి అపాయింట్​మెంట్​లను కుదించినట్లు వివరించారు.

ఇదీ చూడండి: మూడో దశ వ్యాక్సినేషన్​ కోసం 2.45 కోట్ల రిజిస్ట్రేషన్లు

ABOUT THE AUTHOR

...view details