రైల్వే శాఖ టికెట్ బుకింగ్ విధానంలో అనేక మార్పులు చేసింది. టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రతి ప్రయాణికుడు కచ్చితంగా ఇంతుకుముందు కంటే అదనపు సమాచారం అందించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల ఇంటి నంబర్, వీధీ, కాలనీ, సిటీ, జిల్లా, చరవాణీ నెంబర్ వంటి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ వైబ్‌సైట్, యాప్, రిజర్వేషన్ కౌంటర్... ఏ విధానంలో టికెట్ బుక్ చేసుకున్నా ఈ సమాచారం ఇవ్వాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. టికెట్ రద్దు చేసుకున్న వారికి పాత విధివిధానాలే కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.
రైల్వే టికెట్ బుకింగ్‌కు పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే - రైల్వే టికెట్ బుకింగ్
కరోనా విజృంభనతో రైల్వే టికెట్ బుకింగ్ విధానంలోనూ అనేక మార్పులు చేశారు. ప్రయాణికుడి పూర్తి వివరాలు తప్పనిసరిగా అందించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. టికెట్ రద్దు చేసుకున్న వారికి పాత విధివిధానాలే కొనసాగిస్తున్నట్టు వివరించారు.
రైల్వే టికెట్ బుకింగ్‌కు పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే