ఖతర్‌లో ఐసీసీ ఆధ్వర్యంలో భారతీయ ఎంబసీ పర్యవేక్షణలో ప్యాసెజ్ టూ ఇండియా ప్రవాస భారతీయుల సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖతర్‌లో పనిచేస్తున్న భారతీయులు, స్థానిక అరబ్బులు, ఇతర జాతీయుల సమక్షంలో తెలుగు రాష్ట్రాల కళలు, సంస్కృతి ఈ ఉత్సవాలల్లో ప్రతిబింబించింది.
ఖతర్‌లో ఘనంగా ప్యాసెజ్ టూ ఇండియా ఉత్సవాలు - passage to india
ఖతర్‌లోని భారతీయ ఎంబసీ పర్యవేక్షణలో ఐసీసీ ఆధ్వర్యంలో ప్యాసెజ్ టూ ఇండియా’ ప్రవాస భారతీయుల సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్స్ సౌజన్యంతో రెండ్రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాల ప్రవాసీయులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
![ఖతర్‌లో ఘనంగా ప్యాసెజ్ టూ ఇండియా ఉత్సవాలు passage to india cultural program in Qatar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5782370-thumbnail-3x2-a.jpg)
ఖతర్‌లో ఘనంగా ప్యాసెజ్ టూ ఇండియా ఉత్సవాలు
ఖతర్, భారత్ 2019 మైత్రి సంవత్సరం ముగింపుగా వైభవంగా జరిగిన ఇండియా పాసెజ్ కార్యక్రమం ఖతర్‌లోని భారతీయులను అలరించింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ కార్యక్రమాలను ఈ ఉత్సవాలలో ప్రదర్శించారు.
తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి పోటాపోటీగా ప్రదర్శించిన జానపాద గేయాలు, బంజారా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దిల్లీలోని ఎర్రకోట నమూనాను సభా ప్రాంగణంలో అమర్చగా అరబ్బులతో పాటు సందర్శకులూ ప్రత్యేకంగా ఫొటోలు దిగారు.
ఖతర్‌లో ఘనంగా ప్యాసెజ్ టూ ఇండియా ఉత్సవాలు
- ఇదీ చూడండి : ఇరాక్: అమెరికా రాయబారి కార్యాలయంపై రాకెట్ దాడి