తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేసిన దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి - nomination for rajya sabha seats

Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులు దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్, సబిత పాల్గొన్నారు.

nomination for rajya sabha seats
రాజ్యసభ స్థానాలకు నామినేషన్

By

Published : May 25, 2022, 12:23 PM IST

Rajya Sabha Elections: రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు తెరాస అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు, హెటిరో గ్రూప్స్ ఛైర్మన్ పార్థసారథి రెడ్డి నామినేషన్​ దాఖలు చేశారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ పదవీకాలం జూన్​లో పదవీకాలం ముగియనుండటంతో.. ఈ ఎన్నిక జరగనుంది. ఈ నెల 31 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ ఒకటో తేదీన నామినేషన్ల పరిశీలన, మూడోతేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్‌ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్​, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details