తెలంగాణ

telangana

ETV Bharat / city

అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోన్న చిలుక - అందరినీ అలరిస్తున్న రామచిలుక

ఏపీ కడప జిల్లాలో ఓ చిలుక ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ దుకాణంలోని దేవతా చిత్రపటాల వద్దే తిరుగుతూ అక్కడే చక్కర్లు కొట్టడాన్ని అక్కడి వారు ఆశ్చర్యంగా తిలకించారు. మెుదటిసారి తనకు ఇటువంటి సంఘటన ఎదురైందని సదరు యజమాని చెబుతున్నాడు.

parrot
చిలుక

By

Published : Apr 8, 2021, 10:58 PM IST

ఏపీ కడప జిల్లా ఖాజీపేటలో రామచిలుక ఒకటి వింతగా ప్రవర్తిస్తోంది. ఓ పురుగు మందుల దుకాణంలోని దేవతామూర్తుల చిత్రపటాల వద్దకు చేరిన రామచిలుక ఒకటి అక్కడే చక్కర్లు కొడుతోంది. గమనించిన దుకాణ యజమాని.. ఆ చిలుకను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఉదయం షాపు తెలిచిన తరువాత సుమారు ఉదయం 10.30 గంటల సమయంలో చిలుక వచ్చిందని యజమాని జంపన ఓబులరెడ్డి తెలిపారు. బయటకు పంపే ప్రయత్నం చేసినా వెళ్లకుండా చిత్రపటాల వద్దకు వచ్చిందన్నారు. రామచిలుకకు ఆహారం అందించగా.. అది ఎంచక్కా తిని అక్కడే ఉంటోందని.. ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని చెప్పారు.

మొదటిసారిగా రామచిలుక ఇలా తన దుకాణంలోకి రావడం.. అక్కడే దేవుడి పటాల దగ్గర ఉండడంపై యజమాని ఓబులరెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆశ్చర్యానికి గురిచేస్తోన్న చిలుక

ఇదీ చదవండి:సామూహిక పంచాంగ శ్రవణం వద్దు.. నిరాడంబరంగానే ఉగాది వేడుకలు

ABOUT THE AUTHOR

...view details