PARITALA SRIRAM: ప్రతి తెలుగుదేశం కార్యకర్తా.. ఒక పరిటాల రవి కావాలని పరిటాల శ్రీరామ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రామగిరి, చెన్నే కొత్తప్లల్లి, కనగానపల్లి మండలాల నూతన కమిటీ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు.
PARITALA SUNITHA: 'నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి' - అనంతపురం జిల్లా వార్తలు
PARITALA SRIRAM: రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి తెదేపా కార్యకర్తా.. ఒక పరిటాల రవి కావాలని రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ అన్నారు. రామగిరి, చెన్నేకొత్తప్లల్లి, కనగానపల్లి మండలాలకు సంబంధించిన నూతన కమిటీ కార్యక్రమంలో మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు.
![PARITALA SUNITHA: 'నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి' PARITALA SUNITHA: 'నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14155521-321-14155521-1641886710223.jpg)
12:55 January 11
PARITALA SUNITHA: 'నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా.. ఆశీర్వదించండి'
పరిటాల రవి రాజకీయాల్లోకి వచ్చే సమయానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని శ్రీరామ్ పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంలో అన్ని వర్గాలూ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. తెలుగుదేశం నేతలు తెగింపుతో పని చేయాలన్నారు. అలాంటి వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా పరిటాల సునీత తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. తన బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నానని, ఆశీర్వదించాలని విజ్ఙప్తి చేశారు.
ఇదీ చదవండి: