తెలంగాణ

telangana

ETV Bharat / city

Drug addiction : మీ పిల్లలకు డ్రగ్స్ అలవాటుందా.. తెలుసుకోవాలంటే ఏంచేయాలో తెలుసా? - drug addiction

ఓసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అని సిగగెట్, మద్యంతో మొదలుపెట్టి నెమ్మదిగా డ్రగ్స్​ వెళ్తోంది నేటి యువత. ఒక్కసారి టేస్ట్ చూశాక.. అదిచ్చే కిక్​కు అలవాటు పడి ఎంతో మంది యువకులు ఆ మత్తు మాయలో జీవితాలు చిత్తు చేసుకుంటున్నారు. అది సీరియస్ అయ్యే వరకు వారి తల్లిదండ్రులకు తెలియడం లేదు. తమ పిల్లలకు డ్రగ్స్ ఎలా అలవాటయ్యాయో తెలియక కన్నవాళ్లు తలలు పట్టుకుంటున్నారు. పిల్లలు మత్తుకు బానిసవుతున్నారో లేదో తెలుసుకోవాలంటే...

Drug addiction
Drug addiction

By

Published : Oct 11, 2021, 6:49 AM IST

యువత మత్తు(Drug addiction) వలయంలో కూరుకుపోతోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలైన వ్యసనం మాదకద్రవ్యాలకు(Drug addiction) విస్తరిస్తోంది. గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహం(నావల్టీ కికింగ్‌)తోనే ఎక్కువ మంది రొంపిలోకి దిగుతున్నారు. స్నేహితుల జన్మదిన వేడుకల్లో, వారాంతపు పార్టీల్లో గంజాయి సేవనం(cannabis) సాధారణమైపోయింది. ఆ తర్వాత గోవాలాంటి ప్రాంతాల్లో దొరికే ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌కు అలవాటు పడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్‌(Drug addiction) కోసం రహస్య సంకేత పదాలతో సంభాషణలు సాగిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో తొలిదశలో వ్యసనాన్ని గుర్తించి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే సత్ఫలితాలుంటాయని అమృత ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు దేవికారాణి చెబుతున్నారు.

గుర్తించడం ఇలా..

విద్యార్థుల బ్యాగ్‌ల్లో లైటర్‌, ఐడ్రాప్స్‌, ఒ.సి.బి.పేపర్‌ లాంటివి గమనిస్తే అనుమానించాలి. స్నేహితులతో టెర్రస్‌పై ఎక్కువ సమయం గడుపుతుంటే ఏంచేస్తున్నారో కనిపెట్టాలి.

ఇంటికి దూరంగా ప్రైవేటు గదుల్లో, వసతిగృహాల్లో ఉంటే ఆకస్మికంగా సందర్శించి పరిస్థితుల్ని గమనించాలి. తరచూ కళాశాల యాజమాన్యంతో విద్యార్థి ప్రవర్తనపై ఆరా తీయాలి.

మాదకద్రవ్యాలు వినియోగించడం నేరమని చెప్పాలి. ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష లేదా రూ.20 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంటుందని అవగాహన కల్పించాలి. సరఫరా చేస్తూ దొరికితే 10-20 ఏళ్ల శిక్ష పడుతుందని స్పష్టం చేయాలి.

నషాముక్త్‌ భారత్‌తో అవగాహన

మద్యం, మాదకద్రవ్యాల(Drug addiction) బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతున్నా విముక్తి కేంద్రాలు పెరగడం లేదు. తెలంగాణలో ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కేంద్రం ‘నషాముక్త్‌ భారత్‌ అభియాన్‌(Nasha Mukt Bharat Abhiyan)’ పేరిట రాష్ట్రంలో అయిదుగురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు శిక్షణ ఇచ్చింది. వారి ద్వారా పాఠశాలల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details