తెలంగాణ

telangana

ETV Bharat / city

బడికొద్దులే కన్నా.. ఇంట్లోనే ఆడుకో నాన్న! - తెలంగాణ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ సర్వే

ఒకప్పుడు బడికెళ్లనని పిల్లలు మారం చేసేవారు. ఇప్పడు బడి వద్దని తల్లిదండ్రులే అంటున్నారు. ఈ మార్పునకు కారణం కరోనా. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల్ని బడికి పంపడానికి తల్లిదండ్రులు మొగ్గుచూపడం లేదంటా. చదువులు, ర్యాంకుల కంటే పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటున్నారు. తెలంగాణ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి.

SCHOOL
SCHOOL

By

Published : Jun 29, 2020, 11:37 AM IST

బయటకు వెళ్లాలంటే పదిసార్లు ఆలోచిస్తున్నారు. పిల్లలున్న కుటుంబాల్లో పెద్దలు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఎటునుంచి మహమ్మారి దాడి చేస్తుందనే భయం ప్రతినోటా వినిపిస్తుంది. ఇటువంటి క్లిష్ట సమయంలో పిల్లలను పాఠశాలలకు పంపాలా? లేదా? అనేది సందిగ్దంగా మారింది. మహానగరంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ ఆందోళన రెట్టింపునకు చేరింది.

అధికశాతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఆన్‌లైన్‌ చదువుకు ప్రోత్సహిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని విద్యాసంస్థలు తరగతులు ప్రారంభించినా పంపేందుకు విముఖత వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభించడంపై తెలంగాణ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈనెల 26, 27 తేదీల్లో ఆన్‌లైన్‌ ద్వారా సంఘం సైకాలజిస్టు డాక్టర్‌ ఎం.రాంచందర్‌, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టు మాధవి ఆధ్వర్యంలో శాంపిల్‌ సర్వే జరిపినట్టు నిర్వాహకులు తెలిపారు.

ప్రశ్నలు 10.. తల్లిదండ్రులు 1,140..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలున్న వారిని మాత్రమే దీనికి ఎంచుకున్నారు. 10 అంశాలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించారు. 1,140 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 98శాతం(1,121) మంది తల్లిదండ్రులు తమ బిడ్డల భద్రత, ఆరోగ్యశ్రేయస్సుకే అధిక ప్రాధాన్యమిచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లోనే పిల్లలు సురక్షితంగా ఉంటారనే అభిప్రాయం వెలిబుచ్చారు. 2020ను జీవో విద్యాసంవత్సరంగా మార్చాలని కోరుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రమోట్‌ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తే బావుంటుందనే ఆశాభావం వ్యక్తం చేయటం విశేషం.

ర్యాంకులకన్న ఆరోగ్యమే ముఖ్యం

ఇప్పటికిప్పుడు బడి వద్దనే వారు 95శాతం మంది ఉన్నారు. కరోనా వైరస్‌ పూర్తిగా తగ్గిన తరువాతనే పాఠశాలలకు పంపుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ తరగతుల పట్ల ఆసక్తి చూపట్లేదు.

ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వారి తల్లిదండ్రులు మాత్రం ఆన్‌లైన్‌కే మద్దతు పలికారు. మార్కులు, ర్యాంకులను మించి బిడ్డల ఆరోగ్యమే తమకు ముఖ్యమంటున్న తల్లిదండ్రుల ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ రాంచందర్‌ తెలిపారు. నివేదిక కాపీని ప్రభుత్వానికి సమర్పిస్తామని వివరించారు.

ఇవీ సర్వే అభిప్రాయాలు

  • 63శాతం మంది 2020-21 జీరో విద్యాసంవత్సరం కావాలంటున్నారు
  • 62శాతం.. వచ్చే విద్యాసంవత్సరం తదుపరి తరగతికి ప్రమోట్‌ చేయాలి
  • 99శాతం విద్య కంటే పిల్లల ఆరోగ్యం, సంరక్షణకు ప్రాధాన్యం
  • 60శాతం మంది తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ తరగతుల పట్ల ఆసక్తి చూపారు
  • 95శాతం ఇప్పటికిప్పుడు బడి తలుపులు తెరిచినా పంపమంటున్నారు
  • 78.8 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు పెరగటంపై ఆందోళన వెలిబుచ్చారు

ఇదీ చదవండి:హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

ABOUT THE AUTHOR

...view details