తెలంగాణ

telangana

ETV Bharat / city

'దీన్​దయాల్‌ స్ఫూర్తితో దేశ నవ నిర్మాణంలో భాగస్వాములం అవుదాం' - pandit deen dayal birth anniversary

భాజపా రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాల్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు డీకే అరుణ, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు పాల్గొన్నారు. దీన్‌ దయాల్‌ స్పూర్తితో దేశ నవ నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని నేతలు సూచించారు.

pandit-deen-dayal-birth-anniversary-in-bjp-office-hyderabad
pandit-deen-dayal-birth-anniversary-in-bjp-office-hyderabad

By

Published : Sep 25, 2021, 1:29 PM IST

రాష్ట్రంలో తెరాస సర్కారు ప్రజాస్వామ్య విరుద్దంగా పనిచేస్తోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. తెరాసకు ప్రత్యామ్నాయ పార్టీగా భాజపా ఎదిగేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన సూచించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాల్‌ జయంతి వేడుకల్లో లక్ష్మణ్‌తో పాటు డీకే అరుణ, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు పాల్గొన్నారు.

పండిట్ దీన్ దయాల్‌ రాజకీయ వారసులుగా భాజపా నాయకులు పనిచేస్తున్నారని లక్ష్మణ్​ తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చినట్టు వెల్లడించారు. పండిట్ దీన్‌ దయాల్ జయంతి సందర్భంగా.. మొక్కలు నాటే కార్యక్రమాన్ని భాజపా చేపట్టిందని డీకే అరుణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. దీన్‌ దయాల్‌ స్పూర్తితో దేశ నవ నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలన్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details