ఏపీలోని కడప, నెల్లూరు జిల్లాల్లో పలు గ్రామాల్లో ఇవాళ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా చేజర్ల, మర్రిపాడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గతంలో జరగాల్సిన ఎన్నికలు పలు కారణాల వల్ల వాయిదా పడ్డాయి. చేజర్ల మండలం వావిలేరు, మైపాటివారి కండ్రిక... మర్రిపాడు మండలం కంపసముద్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఏపీలోని రెండు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు - chejerla panchayati elections updates
ఏపీలోని నెల్లూరు, కడప జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో ఇవాళ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు కారణాలతో వాయిదా పడిన ఎన్నికలను ఎస్ఈసీ ఈరోజు నిర్వహిస్తోంది.
ఏపీలోని రెండు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు
కడప జిల్లా వేంపల్లె మండలం టి.వెలమవారిపల్లెలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో అభ్యర్థులు లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు... బందోబస్తు చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి:'పట్టణప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి'